లండన్‌లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

KCR Birthday celebrations in London - Sakshi

లండన్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు లండన్‌లో ఘనంగా జరిగాయి. కేసీఆర్ అండ్ తెరాస సపోర్టర్స్ అఫ్ యూకే ఆధ్వర్యంలో ఆదివారం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఎంతో అంగ రంగ వైభవంగా ముగిశాయి. విదేశాల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా జన్మదిన వేడుకలు నిర్వహించినట్లు ఏజ్ లింక్ అనే వృద్ధుల సేవా సంఘం, బ్రహ్మకుమారీస్ సేవా సంఘాలతో కలిసి పలు ధ్యాన, శాంతి ప్రవచనాలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని, కేసీఆర్ చేసిన కృషికి అద్దం పెట్టెలా ఒక వీడియో సాంగ్ చేసి ఎం.ఆర్.ఎయెలకు ఇచ్చినట్లు వ్యవస్థాపకులు సిక్కా చంద్రశేఖర్ గౌడ్  తెలిపారు. 

శివకుమార్ చెలాపురం అధ్యక్షతన జరిగిన ఈవెంట్లో సుమారు 100 మంది వృద్ధులు పాల్గొన్నారు. మొదటి తరం తెలంగాణ సంబంధించిన రాజ్ బాలరాజ్ 30 యేండ్ల కింద స్థాపించిన ఏజ్ లింక్ సంస్థతో పనిచేయడం, వారి ఆశయాలను ముందుకు తీసుకపోవడం ఎంతో ఆనందంగా ఉందని గోలి తిరుపతి నగేష్ కాసర్ల అన్నారు. యూకే నలుమూలల నుంచి తెరాస పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
పాశ్చాత్య దేశాలలో వృద్ధులకు ఒంటరినితనం ఉంటుందని వారికి మెడిటేషన్, సాంస్కృతిక కార్యక్రమాలు, హైదరాబాద్ బిర్యానీ రుచిని, తెలంగాణ వంటకాలు వృద్ధ ఆంగ్లేయులకు పరిచయం చేశామని సురేష్ గోపతి, భాస్కర్ పీటలు అన్నారు. కేసీఆర్‌ వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని, కేసీఆర్ లేని తెలంగాణ ఊహాజనితమని పేర్కొన్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలు ఆనందంగా ఉండటానికి కారణం ఆయనేనని, వివిధ రంగాల్లో ప్రోత్సహిస్తున్న సీఎంకు రుణపడి ఉంటామని మహిళా విభాగం వారు పేర్కొన్నారు.

 

కేసీఆర్ జన్మదినం యావత్ తెలంగాణ పండుగ దినమని, ఒక రాజకీయ నాయకునికంటే యువతకు, ప్రవాస భారతీయులకు స్ఫూర్తిదాయకమని భాస్కర్ మొట్ట, శ్రీధర్ నీల తెలిపారు. ఈ సందర్భంగా నరేష్ గుప్త మర్యాల, మొహమ్మద్ జాఫర్ మాట్లాడుతూ.. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ప్రతీ ఇంటికి మంచినీరు అందించేందుకు ప్రవేశపెట్టిన మిషన్‌ భగీరథ పథకాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. పేద ప్రజలకోసం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్‌, వితంతు, వికలాంగుల, వృద్ధుల పింఛన్లు వంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు అందించిన ఘనత కేసిఆర్‌కు దక్కుతుందన్నారు 

కేసీఆర్ జన్మదిన వేడుకలను తెరాస పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యక్రమంగా కాకుండా ప్రజల కార్యక్రమంగా నిర్వహించాలని, వారి ఉద్యమ స్ఫూర్తి రాబోయే తరాలవారికి తెలియజేయాలన్న ఒకే ఒక నినాదంతో ఈ వేడుకలు చేస్తున్నామని రాజేష్ ఎట్టిబోయిన, జయంత్ నార్పరాజు తెలిపారు. అహింసా మార్గాన 4 కోట్ల మందికి న్యాయం చేసిన వ్యక్తి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం సంతోషమని ప్రముఖ సంఘ సేవకులు డాన్ జూన్సన్ తెలిపారు. పేదల పెన్నిది తెలంగాణ రాష్ట్ర సృష్టికర్త అయిన కేసీఆర్‌ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ఎంతో కృషి చేస్తారన్నారు. అదేవిధంగా ఇంటింటికీ నీరు అందించేందుకు మిషన్‌ భగీరథ, చెరువులకు పూర్వ వైభోగాన్ని తీసుకువచ్చేందుకు మిషన్‌ కాకతీయ వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల గుండెల్లో నిలిచిన కేసీఆర్‌ జన్మదినాన్ని ఎంతో అంగరంగ వైభవంగా చేసుకోవడం హర్షనీయమని వేణు రెడ్డి, శివ నారపక కొనియాడారు.

కార్యక్రమంలో ఏజ్ లింక్ సభ్యులు గ్రాహం బేకర్, రిచర్డ్ సిషన్, డీన్ క్యారీ, సాలీ హౌగ్, అనిల్ పాండే, పార్థ ముడూర్ కేసీఆర్ జన్మదిన సందర్భంగా చేస్తున్న ఈ స్వచ్ఛంద కార్యక్రమాలకి ఎంతో సంతోషించి తెరాస పార్టీ కండువాలు ప్రశాంత్ కటికనేని కప్పారు. జన్మదిన సందర్భంగా యూకే జాగృతి ప్రెసిడెంట్ సుమన్ బలమూరి, తెలుగు అసోసియేషన్ అఫ్ లండన్ ప్రెసిడెంట్ శ్రీధర్ మేడిశెట్టి, యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్ సంబంధించి ఉదయ్ ఆరేటి, తెలంగాణ ఎంఆర్ఎం ఫోరమ్ అధ్యక్షులు ప్రమోద్ అంతటి, బ్రహ్మకుమారీస్ హారిక బెహెన్, లేబర్ పార్టీ, కంజర్వేటివ్, గ్రీన్ పార్టీకి సంబదించిన వివిధ నాయకులు, ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేశారు. పలు దేశాలకు చెందిన వృద్ధ సంఘ సేవకులతో కలిపి వాలంటీర్లు సంతోష్ ఆకుల, మొయిన్, వీరేశం, మోహన్, ప్రశాంత్ సంధి, పార్థ ముడూర్, రామకృష్ణ కల్వకుంట్ల, పవన్ గౌడ్ బండి, సురేష్ వడ్లమూరి, మహిళా విభాగం సభ్యులు జ్యోతిరెడ్డి కాసర్ల, మంజుల పిట్టల, నందిని మొట్ట, శిరీష రెడ్డి మార్విడా, రమాదేవి, ప్రీతీ నోముల, రజిత స్వాతి, రామ దిశిత, స్వాతి పురుషోత్తమ్ ఉన్నారు. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top