
మిచిగాన్‌లో శనివారం దీపావళి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ట్రాయ్ తెలుగు అసోషియేషన్, మిచిగాన్ ఆధ్వర్యంలో జరుగుతాయని నిర్వాహకులు ప్రకటించారు. ఈమేరకు నిర్వాహకులు వెంకటేష్ బాబు, ప్రసాద్ గంగిసెట్టి, సురేష్ చోలవీటిలు పత్రికా ప్రకటన విడుదల చేశారు.
లాంఫర్ హైస్కూలులో శనివారం మద్యాహ్నం 3గంటలనుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, దీపావళి వేడుకలు ప్రాంరంభం అవుతాయని నిర్వాహకులు తెలిపారు. అనంతరం రాత్రి ఎనిమిది గంటలకు విందు ఉంటుందన్నారు. తెలుగు వారు ఎక్కడ ఉన్నా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. ఈమేరకు కార్యక్రమ నిర్వహకులు దీపావళి వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.