సిగరెట్‌కోసం హత్య | Youth shot dead for not giving cigarette; duo held | Sakshi
Sakshi News home page

సిగరెట్‌కోసం హత్య

Jul 7 2014 10:08 PM | Updated on Jul 30 2018 8:29 PM

సిగరెట్ ఇవ్వలేదనే కోపంతో ఓ యువకుడిని కాల్చి చంపారనే ఆరోపణలపై ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

న్యూఢిల్లీ: సిగరెట్ ఇవ్వలేదనే కోపంతో ఓ యువకుడిని కాల్చి చంపారనే ఆరోపణలపై ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ ఘటన జూలై 1న, సియానీ గేట్ ప్రాంతంలో జరిగింది. సిగరెట్ ఇచ్చేందుకు నిర్మల్ నిరాకరించడంతో ప్రదీప్‌కుమార్, రాహుల్‌లు అతణ్ని నాటు తుపాకీతో కాల్చి చంపారు. నిందితులిద్దరూ మాదకద్రవ్యాలకు బానిసలయ్యారని దర్యాప్తులో తేలింది. నిర్మల్‌ను కాల్చి ఘటనా స్థలం నుంచి ఇద్దరూ పారిపోయారు. దీనిని గమనించిన స్థానికులు నిర్మల్‌ను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. కాగా అప్పటికే నిర్మల్ మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లభించిన ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించారు. దీంతో సోమవారం ఇద్దరు పట్టుబడ్డారు. వారి నుంచి నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement