ఆ కారు ధర.. 4 వేలే! | you can win dawood ibrahim used car for rs 4 thousand only | Sakshi
Sakshi News home page

ఆ కారు ధర.. 4 వేలే!

Dec 9 2015 6:32 PM | Updated on Sep 3 2017 1:44 PM

ఆ కారు ధర.. 4 వేలే!

ఆ కారు ధర.. 4 వేలే!

అది ఒకప్పుడు దేశంలోనే మోస్ట్ వాంటెడ్‌గా పేరున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం దర్జాగా తిరిగిన కారు. ఆకుపచ్చ రంగు హ్యుందయ్ ఎసెంట్ సెడాన్ మోడల్. ఆ కారును ఇప్పుడు వేలంలో పెట్టగా.. దానికి కనీస ధరను రూ. 4 వేలుగానే నిర్ణయించారు.

అది ఒకప్పుడు దేశంలోనే మోస్ట్ వాంటెడ్‌గా పేరున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం దర్జాగా తిరిగిన కారు. ఆకుపచ్చ రంగు హ్యుందయ్ ఎసెంట్ సెడాన్ మోడల్. ఆ కారును ఇప్పుడు వేలంలో పెట్టగా.. దానికి కనీస ధరను రూ. 4 వేలుగానే నిర్ణయించారు. దాదాపు దశాబ్దం క్రితం ఈ కారుతో పాటు మరికొన్నింటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే దావూద్ అసలు ఆస్తులతో పోలిస్తే ఇవి నామమాత్రమేనని చెబుతున్నారు. కొన్నింటిని ఇప్పటికే గతంలో అమ్మకానికి పెట్టగా, మిగిలినవాటి మీద ఎవరూ పెద్దగా దృష్టిపెట్టలేదు. దక్షిణ ముంబైలోని ఓ హోటల్ వద్ద బుధవారం నాడు వేలం నిర్వహించగా, అక్కడ భారీగా జనం పోగుపడ్డారు. దావూద్ ఆస్తులను స్వాధీనం చేసుకోడానికి భారత ప్రభుత్వం చాలా కాలం పాటు పోరాడాల్సి వచ్చింది. దావూద్‌తో పాటు అతడి బంధువుల ఆస్తులను కూడా చివరకు స్వాధీనం చేసుకున్నారు.

'ఢిల్లీ జకియా' హోటల్‌ను వేలంలో పెట్టగా, ఒకప్పటి జర్నలిస్టు, ప్రస్తుత ఉద్యమకారుడు ఎస్. బాలకృష్ణన్ దాన్ని రూ. 4.28 కోట్లకు సొంతం చేసుకున్నారు. బుర్హానీ అనే వ్యక్తి రూ 4.27 కోట్లకు బిడ్ దాఖలు చేయగా, తాను మరో లక్ష రూపాయలు పెంచి బిడ్ వేశానని బాలకృష్ణన్ మీడియాకు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement