అయోధ్యలో రాముని భారీ విగ్రహం! | Yogi Adityanath Plans Big Lord Ram Statue On Ayodhya's Saryu River | Sakshi
Sakshi News home page

అయోధ్యలో రాముని భారీ విగ్రహం!

Nov 3 2018 4:44 AM | Updated on Nov 3 2018 4:44 AM

Yogi Adityanath Plans Big Lord Ram Statue On Ayodhya's Saryu River - Sakshi

లక్నో: అయోధ్యలోని సరయూ నదీ తీరంలో శ్రీరాముడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ భావిస్తున్నట్లు సమాచారం. 36 మీటర్ల పీఠంపై 100 మీటర్ల ఎత్తైన రాముని విగ్రహం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రే దీపావళి రోజు ప్రకటించనున్నారని ఆ రాష్ట్ర బీజేపీ వర్గాలు తెలిపాయి. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మహేంద్రనాథ్‌ పాండే మాట్లాడుతూ.. దీపావళి రోజు అయోధ్యకు సంబంధించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఒక శుభవార్త చెప్పనున్నారని, అది ఆయన ద్వారానే వింటే బావుంటుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement