‘బ్యాంక్‌లున్నది విజయ్‌ మాల్యా లాంటి వారి కోసం కాదు’

Yoga Guru Ramdev Said Banks Are Not For Vijay Mallya - Sakshi

ముంబై : మోదీ నాయకత్వం మీద, విధానాల గురించి జనాలకు ఎటువంటి అనుమానం లేదని అంటున్నారు ప్రముఖ యోగా గురువు, పతంజలి సంస్థ వ్యవస్థాపకులు రామ్‌దేవ్‌. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్తాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో బీజేపీ ఓటమిపాలయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్‌దేవ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ అందరిలాంటి వారు కాదు. ఆయన ఓటు బ్యాంక్‌ రాజకీయాలకు విరుద్ధం అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా విలేకరులు ‘2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చారా’ అని అడగ్గా.. ఇలాంటి రాజకీయ ప్రశ్నలకు సమాధనం ఇచ్చి సమస్యలను కొని తెచ్చుకోవాలనుకోవడం లేదు అంటూ తెలివిగా తప్పించుకున్నారు రామ్‌దేవ్‌.

అయన మాట్లాడుతూ.. ఒక విషయం అయితే చెప్పగలను.. మోదీ నాయకత్వం, విధానల పట్ల జనాలకు ఇంకా నమ్మకం ఉంది. మోదీ ఓటు బ్యాంక్‌ రాజకీయాలు చేయరు అంటూ చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమీ మాత్రమే నల్లధనాన్ని పూర్తిగా అరికట్టగల్గుతుందని పేర్కొన్న రాందేవ్‌.. ఈ సందర్భ్ంగా నల్లధనం గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో అన్ని రకాల ధనం సమానంగా ఉంది. అయితే ఇక్కడ అంతు చిక్కని ప్రశ్న ఏంటంటే.. ఇంత డబ్బును ఏం చేయాలి అని. ఈ మొత్తాన్ని వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి ఉత్పత్తి రంగాలకు కేటాయిస్తే మంచిదని పేర్కొన్నారు.

ప్రస్తుతం భారత దేశం మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా మారిందని తెలిపారు. అయితే మరిన్ని సంస్థలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకులు కూడా ఇందుకు సహాకారం తెలపాలని కోరారు. సాయం కావాలని బ్యాంకుకు వచ్చిన వారిలో విజయ్‌ మాల్యా ఎవరో.. నిజాయతి పరుడు ఎవరో గుర్తించగలగే సామార్థ్యం బ్యాంక్‌లకు ఉండాలని తెలిపారు. ఎందుకంటే బ్యాంకులున్నది నిజాయతిపరుల కోసం కానీ విజయ్‌ మాల్లా లాంటి వారి కోసం కాదని వ్యాఖ్యానించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top