బిగ్ బీ అమితాబ్కు కోపం వచ్చిన వేళ! | Writing about Nepal quake not for publicity: Big B | Sakshi
Sakshi News home page

బిగ్ బీ అమితాబ్కు కోపం వచ్చిన వేళ!

May 2 2015 5:40 PM | Updated on Oct 20 2018 6:37 PM

అమితాబ్ బచ్చన్ - Sakshi

అమితాబ్ బచ్చన్

మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నేపాల్కు అండగా ఉండాలని సోషల్ మీడియా వెబ్సైట్స్ ట్విట్టర్, ఫేస్బుక్, బ్లాగ్లలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ముంబై: మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నేపాల్కు అండగా ఉండాలని సోషల్ మీడియా వెబ్సైట్స్ ట్విట్టర్, ఫేస్బుక్, బ్లాగ్లలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పొరుగుదేశం వారమైన మనం నేపాల్ భూకంప బాధితులకు సహాయం చేయాలని ఆయన కోరారు.  అయితే అమితాబ్ విజ్ఞప్తిపై కొందరు సెటైర్లు విసిరారు. ఏదో అజెండా కోసం అమితాబ్ ఇలా చేస్తున్నారని కొందరు నెటిజన్లు విమర్శించారు.

నెటిజెన్ల కామెంట్స్కు బిగ్ బీ అమితాబ్కు కోపం వచ్చింది. వారిపై మండిపడ్డారు. ప్రచారం కోసం ఇలా చేయలేదని వివరించారు. అటువంటి వ్యాఖ్యలు చేసినవారు తమ వైఖరి సరిచేసుకోవాలని అమితాబ్ హితవు పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement