మీటూ : బీజేపీ మహిళా నేత సంచలన వ్యాఖ్యలు | Women Journalists Not So Innocent That They Can Be Misused | Sakshi
Sakshi News home page

మీటూ : బీజేపీ మహిళా నేత సంచలన వ్యాఖ్యలు

Oct 12 2018 3:37 PM | Updated on Mar 29 2019 5:33 PM

Women Journalists Not So Innocent That They Can Be Misused - Sakshi

మధ్యప్రదేశ్‌ బీజేపీ మహిళా విభాగం చీఫ్‌ లతా కేల్కర్‌ (ఫైల్‌ఫోటో)

మధ్యప్రదేశ్‌ బీజేపీ మహిళా నేత అనుచిత వ్యాఖ్యలు..

భోపాల్‌ : తమకు ఎదురైన లైంగిక వేధింపులపై అన్ని రంగాలకు చెందిన మహిళలు బాహాటంగా వెల్లడిస్తున్న క్రమంలో మధ్యప్రదేశ్‌ బీజేపీ మహిళా విభాగం చీఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీటూ ఉద్యమం స్వాగతించదగినదే అయినా కొందరు మహిళా జర్నలిస్టులు చేస్తున్న ఆరోపణలపై సందేహాలు ముందుకొస్తున్నాయని మధ్యప్రదేశ్‌ బీజేపీ మహిళా నేత లతా కేల్కర్‌ వ్యాఖ్యానించారు.

విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఎంజే అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలను ప్రస్తావిస్తూ ఈ ఆరోపణలు చేస్తున్న మహిళా పాత్రికేయులు అమాయకులని తాననుకోవడం లేదని, వారు తమను వాడుకునే అవకాశం ఇతరులకు ఇవ్వరని వ్యాఖ్యానించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంజే అక్బర్‌ను కేబినెట్‌ నుంచి తొలగిస్తారా అనే ప్రశ్నపై మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement