జవాన్‌పై చేయి చేసుకున్న మహిళ అరెస్ట్ | woman slapped army jawan | Sakshi
Sakshi News home page

జవాన్‌పై చేయి చేసుకున్న మహిళ అరెస్ట్

Sep 15 2017 8:24 PM | Updated on Sep 19 2017 4:36 PM

జవాన్‌పై చేయి చేసుకున్న మహిళ అరెస్ట్

జవాన్‌పై చేయి చేసుకున్న మహిళ అరెస్ట్

ఢిల్లీలో ఒక జవాన్‌పై దాడి చేసిన మహిళను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెకు జడ్జి బెయిల్‌ ఇచ్చారు.

సాక్షి, గుర్గావ్‌ : ఢిల్లీలో ఒక జవాన్‌పై దాడి చేసిన మహిళను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెకు జడ్జి బెయిల్‌ ఇచ్చారు. మూడు రోజుల కిందట గుర్గావ్‌ రోడ్డు మీద స్మృతి కల్రాజ్‌ అనే మహిళ తన ఇండికా కారును ఆర్మీ వెహికల్‌ ముందు పార్క్‌ చేసింది. ఆ వాహనాన్ని అడ్డు తీయమని చెప్పిన జవాన్‌కు చేత్తే చెంప ఛెళ్లు మనించింది. ఇలా నాలుగైదుమార్లు ఆమె చేయిచేసుకోవడం రోడ్డు మీదున్న సీసీటీవీలో రికార్డు అయింది. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా.. ఢిల్లీ పోలీసులు స్మృతి కల్రాజ్‌ మీద కేసు నమోదు చేశారు. కారు నెంబర్‌ ఆధారంగా వసంత్‌ గంజ్‌లోని ఆమె ఇంట్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. డ్యూటీలో ఒకవున్న ఒక నిబద్ధ అధికారిమీద చేయిచేసుకోవడం నేరమని పోలీసులు చెబుతున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement