రెండు రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మహిళా మావోయిస్టును గుర్తించారు.
మృతిచెందిన మహిళా మావోయిస్టు గుర్తింపు
Feb 21 2017 11:32 AM | Updated on Sep 5 2017 4:16 AM
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రెండు రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మహిళా మావోయిస్టును గుర్తించారు. ఛత్తీసగఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా అడవుల్లో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళా మావోయిస్టు మృతిచెందింది. మృతురాలిని బీజాపూర్‌జిల్లా ఊసూరు బ్లాక్ పరిధిలో ఉడతపల్లి గ్రామస్తురాలు కుంజా అడిమె(26)గా పోలీసులు గుర్తించారు. ఈమె తండ్రి పేరు దేవా అని, ఏడేళ్లుగా మావోయిస్టు దళంలో పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏరియా కార్యదర్శి పాపారావు ఆధ్వర్యంలో పనిచేస్తున‍్నదన్నారు.
Advertisement
Advertisement