ఆమె కోసం వచ్చి అడ్డంగా బుక్కయ్యాడు | Woman, juvenile charge each other with forced sex, get booked | Sakshi
Sakshi News home page

ఆమె కోసం వచ్చి అడ్డంగా బుక్కయ్యాడు

Jul 12 2016 12:20 PM | Updated on Oct 2 2018 8:44 PM

ఆమె కోసం వచ్చి అడ్డంగా బుక్కయ్యాడు - Sakshi

ఆమె కోసం వచ్చి అడ్డంగా బుక్కయ్యాడు

ఫేస్బుక్లో పరిచయమైన మహిళతో ఏకాంతంగా గడిపేందుకు వచ్చిన 17 ఏళ్ల బాలుడు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

న్యూఢిల్లీ: ఫేస్బుక్లో పరిచయమైన మహిళతో ఏకాంతంగా గడిపేందుకు వచ్చిన 17 ఏళ్ల బాలుడు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. తనే రమ్మందని చెప్పి ఆమెను కూడా పోలీసులకు పట్టించాడు. టీవీలో క్రైమ్ డ్రామాను మరిపించేలా ఉన్న ఈ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. ఫేస్బుక్లో 'జిందా' పేరుతో ఉన్న 26 ఏళ్ల మహిళతో బాలుడు పరిచయం పెంచుకున్నాడు. సోమవారం వారిద్దరూ వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఓ హోటల్లో కలుసుకున్నారు.

ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఆమె హఠాత్తుగా పోలీసులకు ఫోన్ చేసింది. తనపై అతడు అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏకాంతంగా గడపడానికి రావాలని ఆమె కోరిందని, తాను తిరస్కరించినా పదేపదే అడగడంతో కాదనలేక వచ్చానని పోలీసులతో బాలుడు చెప్పాడు. దీంతో ఇద్దరిపైనా పోలీసులు కేసు పెట్టారు. బాలుడిపై అత్యాచారం కింద, మహిళపై 'పోస్కో' చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఇదంతా 'హనీట్రాపింగ్'లో భాగమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement