మహిళా పోలీసును సెలవుపై వెళ్లమన్న ముఖ్యమంత్రి | Woman Constable Sexually Harassed by ASP | Sakshi
Sakshi News home page

మహిళా పోలీసుపై వేధింపులు.. సెలవుపై వెళ్లమన్న ముఖ్యమంత్రి

Nov 26 2017 2:32 PM | Updated on Mar 19 2019 5:52 PM

Woman Constable Sexually Harassed by ASP - Sakshi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లో మహిళలపై ఆరాచకాలు, అత్యాచారాలు, లైంగిక వేధింపుల పర్వానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. తాజాగా అడిషనల్‌ ఎస్పీ రాజేంద్ర వర్మ తనను లైంగికంగా వేధించినట్లు ఒక మహిళా కానిస్టేబుల్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు ఫిర్యాదు చేశారు. ఏఎస్పీ రాజేంద్రవర్మ లైంగిక వేధింపుల వల్ల మానసికంగా, శారీరకంగా కుంగిపోయినట్లు ఆమె పేర్కొన్నారు. రాజేంద్ర వర్మపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగు చర్యలను తీసుకోవాలని ఆమె కోరారు.

నిందితుడిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. అదే సమయంలో.. మూడు నాలుగు నెలలు ఉద్యోగానికి సెలవు పెట్టి.. ప్రశాంతంగా ఉండాలని చౌహాన్‌ సూచించినట్లు ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement