సంచిలో పిండంతో పోలీస్‌స్టేషన్‌కు

Woman brings aborted fetus in bag to police station, raped for months - Sakshi

 అత్యాచార బాధితురాలి ఫిర్యాదు  

సత్నా: మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత మహిళ(20)పై కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడిన నలుగురు దుండగులు ఆమె గర్భవతి కావడంతో ఓ నర్సుతో బలవంతంగా అబార్షన్‌ చేయించారు. దీంతో ఆమె నాలుగు నెలల వయసున్న పిండాన్ని ఓ సంచిలో వేసుకుని బుధవారం సత్నా నగర ఎస్పీ వీడీ పాండే కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.

సత్నాకు చెందిన నీరజ్‌ పాండే, ధీరజ్‌ పాండే, ప్రేమ్‌ కుమార్, రాజ్‌కుమార్‌లు తనపై కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. సప్నా అనే నర్సు సాయంతో తనకు బలవంతంగా అబార్షన్‌ చేయించారని వెల్లడించింది. ఈ విషయం బయట ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరించారంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితులపై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదుచేశామని, దోషుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని సత్నా నగర ఎస్పీ వీడీ పాండే  ప్రకటించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top