పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నెల రోజుల పాటు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నెల రోజుల పాటు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 16 నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. డిసెంబర్ 16 వరకు సమావేశాలు నిర్వహించాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) నిర్ణయం తీసుకుంది.
ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. సర్జికల్ దాడులు, కశ్మీర్ లో సంక్షోభం తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. జూలై 18 నుంచి ఆగస్టు 12 వరకు జరిగిన వర్షాకాల సమావేశాల్లో కీలక జీఎస్టీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.