దురదృష్టవంతులను కోరుకోవడం ఎందుకు? | why elect unlucky fellows, asks narendra modi | Sakshi
Sakshi News home page

దురదృష్టవంతులను కోరుకోవడం ఎందుకు?

Feb 2 2015 11:16 AM | Updated on Aug 15 2018 2:20 PM

దురదృష్టవంతులను కోరుకోవడం ఎందుకు? - Sakshi

దురదృష్టవంతులను కోరుకోవడం ఎందుకు?

తనది అదృష్టం అయితే.. దురదృష్టవంతులను ఎన్నుకోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలు వేడెక్కాయి. ప్రధాని నరేంద్రమోదీ అటు కాంగ్రెస్ పార్టీ మీద, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ మీద కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాతే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయని, ఆ రకంగా తనది అదృష్టం అయితే.. దురదృష్టవంతులను కోరుకోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలూ అబద్ధాలు వల్లిస్తూ కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు.

వాళ్లు పొద్దున్న లేచినప్పటి నుంచి అబద్ధాలు ఎలా ప్రచారం చేయాలా అనే ఆలోచిస్తారని, ఢిల్లీ ఎన్నికల్లో ఇంతకుముందు ఎప్పుడూ ఇంత ఘోరంగా అబద్ధాల మీద ఆధారపడిన సంఘటనలు లేవని మోదీ అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు నిండేసరికల్లా దేశంలోని ప్రతి కుటుంబానికీ సొంత ఇల్లు ఉండాలనేదే తన ఆశయమని చెప్పారు. సుపరిపాలన, అభివృద్ధి చూసి ఓట్లేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement