దారిలో ఉన్నాం.. హిందీలో ట్రంప్‌ ట్వీట్‌!

We Are On The Way President Donald Trump Tweets In Hindi - Sakshi

న్యూఢిల్లీ : భారత్‌కు విచ్చేస్తున్న అమెరికా అధ్యక్షుడు టంప్‌.. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌కు హిందీలో రిప్లై ఇచ్చారు. వారి రాకను తెలియజేస్తూ ఆయన ట్వీట్‌ చేశారు. ‘మేము భారతదేశానికి రావాలని ఎదురుచూస్తున్నాం. మేము దారిలో ఉన్నాం. కొద్ది గంటల్లో అందరినీ కలుస్తాం!’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. భార్య మెలానియా ట్రంప్‌తో కలిసి ఆయన నిన్న వాషింగ్టన్‌ డీసీ నుంచి ఎయిర్‌ఫోర్స్‌ 1 విమానంలో బయల్దేరిన సంగతి తెలిసిందే. వారి వెంట కూతురు ఇవాంక ట్రంప్‌, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ కూడా ఇండియా వస్తున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు వారంతా అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అంతకు ముందు ప్రధాని మోదీ ట్విటర్‌లో.. ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు స్వాగతం పలికేందుకు యావత్‌ భారతం ఎదురుచూస్తోంది. మీ సందర్శన కచ్చితంగా ఇరు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అహ్మదాబాద్‌లో కలుద్దాం’ అని పేర్కొన్నారు. గుజరాత్‌ వ్యాప్తంగా ‘నమస్తే ట్రంప్‌’అనే మాటే వినబడుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ట్వీట్‌ చేశారు.
(చదవండి : ట్రంప్‌ పర్యటన : సీక్రెట్‌ ఏజెన్సీ ఏం చేస్తుంది?)

రెడ్‌ కార్పెట్‌ స్వాగతం..
అధ్యక్షుడు ట్రంప్‌ ఫ్యామిలీతోపాటు అమెరికాకు చెందిన పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల బృందం కూడా భారత పర్యటనకు వస్తోంది. అమెరికా అధ్యక్షుడికి ఘనంగా స్వాగతం పలికేందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రెసిడెంట్‌ ట్రంప్‌ అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ ప్రధాని మోదీ స్వయంగా ఆయనకు రెడ్‌ కార్పెట్‌ స్వాగతం పలుకుతారు. అనంతరం ఇరు దేశాధినేతలు అశేష జనవాహిని మధ్య 22 కిమీమీటర్ల మేర సాగే భారీ రోడ్‌షోలో పాల్గొంటారు. మార్గమధ్యంలో సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు.

అనంతరం మోతేరాలో నూతనంగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంలో నిర్వహించే ‘నమస్తే ట్రంప్‌' కార్యక్రమానికి హాజరవుతారు. సుమారు 1.10 లక్షలమంది సభికులను ఉద్దేశించి ట్రంప్‌, మోదీ ప్రసంగిస్తారు. గతేడాది సెప్టెంబర్‌లో అమెరికాలోని హ్యూస్టన్‌ నగరంలో ప్రవాస భారతీయులు నిర్వహించిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమానికి మోదీతోపాటు ట్రంప్‌ హాజరైన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
(చదవండి : ట్రంప్‌ పర్యటనపై వర్మ సెటైర్లు)
(చదవండి : ట్రంప్‌ దంపతుల లవ్‌ స్టోరీ)

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top