విడ్డూరం: మంత్రి ఇంట్లోకి వర్షపు నీరు | Water Leakage Video in UP Minister Bungalow Viral | Sakshi
Sakshi News home page

విడ్డూరం: మంత్రి ఇంట్లోకి వర్షపు నీరు

Aug 28 2017 12:06 PM | Updated on Sep 17 2017 6:03 PM

విడ్డూరం: మంత్రి ఇంట్లోకి వర్షపు నీరు

విడ్డూరం: మంత్రి ఇంట్లోకి వర్షపు నీరు

ప్రభుత్వ ఏజెన్సీ సంస్థలను పనులు అప్పజెప్పితే ఎంత దారుణంగా ఉంటుందో...

లక్నో: ప్రభుత్వ ఏజెన్సీల పనితీరు ఎంత దారుణంగా ఉంటుందో చూస్కోండంటూ ఏకంగా ఓ మంత్రే తన ఇంట్లో వర్షపు నీరు లీకేజీ వీడియోను వైరల్ చేస్తున్నారు. 
 
ఉత్తర ప్రదేశ్‌ ఆరోగ్య శాఖా మంత్రి సిధార్థ్‌ నాథ్‌ సింగ్‌ ఇంట్లో పై కప్పు నుంచి వర్షపు నీరు లీక్‌ అవుతోంది. వెంటనే తన ట్విట్టర్‌ లో ఆయన ఆ వీడియోను పోస్ట్‌ చేశారు. ‘మంత్రుల బంగళాలో ఎంత దయనీయమైన స్థితి ఉందో చూడండి. ప్రభుత్వ ఏజెన్సీలపైనే ఇంకా ఆధారపడి ఉన్నాం. మెరుగైన సదుపాయాలు కల్పించుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ సిధార్థ్‌ ఓ సందేశం ఉంచారు. గత ప్రభుత్వ(అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ) నిర్లక్ష్యం ఇదేనంటూ మంత్రి సిధార్థ్‌ విమర్శించారు.
 
వంట గదిలో పై కప్పు నుంచి నీరు కారుతుండటం, కింద ఐదు బకెట్లలో వాన నీటిని పడుతుండటం వీడియోలో చూడొచ్చు.
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement