పర్యావరణ పరిశోధనలను ప్రోత్సహించాలి | Vital to encourage research on subjects related to environment | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిశోధనలను ప్రోత్సహించాలి

Oct 5 2018 4:07 AM | Updated on Oct 5 2018 4:07 AM

Vital to encourage research on subjects related to environment - Sakshi

న్యూఢిల్లీ: పర్యావరణానికి సంబంధించిన అంశాలపై పరిశోధన, వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించడం చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పర్యా వరణ పరిరక్షణకు తక్షణం చర్యలు ప్రారంభించాలనీ, ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని దినపత్రికల్లో బుధవారం ప్రచురితమైన ఓ వ్యాసంలో మోదీ ఈ అంశాలను ప్రస్తావించారు. వాతావరణా నికి సంబంధించిన ప్రశ్నలపై ప్రజలు వీలైనంత ఎక్కువగా మాట్లాడాల్సిన, రాయాల్సిన, చర్చించాల్సిన, వాదించాల్సిన, దీర్ఘంగా ఆలో చించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణాంశాల్లో నూతన ఆవిష్కరణలు, పరిశోధనల ద్వారా ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యలు, వాటికి పరిష్కారాలు జనానికి తెలుస్తాయని మోదీ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement