ఓపీఎల్‌కు మోదీ, మాల్యా సారథ్యం! | Vijay Mallya and Lalit Modi to start overseas premier league | Sakshi
Sakshi News home page

ఓపీఎల్‌కు మోదీ, మాల్యా సారథ్యం!

Mar 12 2016 2:17 PM | Updated on Sep 3 2017 7:35 PM

ఓపీఎల్‌కు మోదీ, మాల్యా సారథ్యం!

ఓపీఎల్‌కు మోదీ, మాల్యా సారథ్యం!

మొన్న ఐపీఎల్ అవినీతి కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న లలిత్ మోదీ లండన్ పారిపోయారు. నిన్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి భారతీయ బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలను ఎగవేసిన కేసులో లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా లండన్ చెక్కేశారు.

ఢిల్లీ: మొన్న ఐపీఎల్ అవినీతి కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న లలిత్ మోదీ లండన్ పారిపోయారు. నిన్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి భారతీయ బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలను ఎగవేసిన కేసులో లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా లండన్ చెక్కేశారు. లండన్‌లో లలిత్ మోదీ పాస్‌పోర్ట్ పునరుద్ధరణకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సహాయం చేయగా, భారత్ నుంచి మాల్యా పారిపోయేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వమే సహకరించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లలిత్ మోదీ, విజయ్‌మాల్యాల వ్యవహారంలో సామీప్యతను సూచిస్తూ, వారి పట్ల ప్రభుత్వ వ్యవహరించిన తీరును ఎండగడుతూ ట్విట్టర్‌లో వ్యంగోక్తులు వెల్లువెత్తుతున్నాయి. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి....

 ‘లలిత్ మోదీని ఉద్దేశించి మాల్యా: నేనూ భారత అధికారులను ఫూల్స్‌ను చేసి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చాను. ఓవర్సీస్ ప్రీమియర్ లీగ్ (ఓపీఎల్)ను ఏర్పాటు చేసి మస్తుగా డబ్బులు సంపాదిద్దాం పా....

మళ్లీ లలిత్‌ను ఉద్దేశించి మాల్యా: ముందు నువ్వెళ్లు, వెనకాలే నేనొస్తా. సుష్మా స్వరాజ్ మనకు అండగా ఉన్నారు. స్మతి ఇరానీ కూడా సాయం చేస్తారు. మొత్తంగా నరేంద్ర మోదీ సహాయం మనకు ఎటూ పోదు....


మాల్యాను ఉద్దేశించి మోదీ: హార్నీ, నేనే పెద్ద ఫ్రాడ్ అనుకున్నాను. నాకన్నా నీవు సూపర్ ఫ్రాడ్. ఈ ఫ్రాడ్‌ను చట్టబద్ధం చేసే పార్టీని పెడదాం.....వారిద్దరితో ప్రజలు: కొత్త పార్టీ ఎందుకు? టోకున ఒక పార్టీ ఉండనే ఉందిగదా! బీజేపీలో చేరండి, జై మోదీ మస్తాన్!...అసహనం సాకు చెప్పండి, భారత్‌ను వదలి వెళ్లండి. కనీసం కుహనా లౌకికవాదుల మద్దతైనా దొరకుతుంది.....
ఇద్దరు ఎన్నారైలే. ఒకరు భారత్‌కు తిరిగిరానివారు. మరొకరు భారత్‌కు తిరిగి చెల్లించనివారు....


లలిత్‌తో మాల్యా: ఐలవ్ యూ నేవీ నాకు ఇన్‌స్పిరేషన్....గ్రేట్ ఎస్కేప్, ఎస్కేప్ టు విక్చరీలతోపాటు షాశాంక్ రిడెంప్షన్ కూడా నాకు ఇష్టమైన చిత్రం.....సుష్మాకు ఫోన్ చేయ్? నేనూ భారత్ నుంచి పారిపోవాలి....హమ్ దోనోం చోర్ చోర్....’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement