రోహిత్ వేముల వీడియో బహిర్గతం | Video shot days before his suicide: ‘My name is Rohith Vemula. I am a Dalit’ | Sakshi
Sakshi News home page

రోహిత్ వేముల వీడియో బహిర్గతం

Oct 18 2016 10:01 AM | Updated on Sep 4 2017 5:36 PM

రోహిత్ వేముల వీడియో బహిర్గతం

రోహిత్ వేముల వీడియో బహిర్గతం

హెచ్‌సీయూలో ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేముల దళితుడేనని అతడి స్నేహితులు స్పష్టం చేశారు.

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేముల దళితుడేనని అతడి స్నేహితులు స్పష్టం చేశారు. తాను దళితుడినని రోహిత్ స్వయంగా చెప్పుకున్న వీడియోను సోమవారం ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. రోహిత్ దళితుడు అనేందుకు ఆధారాలు లేవని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్‌ఆర్‌డీ) శాఖ నియమించిన ఏక సభ్య కమిషన్ నిర్ధారించిన నేపథ్యంలో ఈ వీడియో బయటపెట్టారు.

వీడియోలో ఏముందంటే... 'నా పేరు రోహిత్ వేముల. నేను గుంటూరుకు చెందిన దళితుడిని. అందరికీ జై భీమ్. 2010 నుంచి హెచ్‌సీయూలో విద్యార్థిగా ఉన్నాను. సోషల్ సైన్స్ లో పీహెచ్ డీ చేస్తున్నాను. సోషల్ సైన్స్, సామాజిక అంశాలపై ఉన్న ఆసక్తితో నా సబ్జెక్ట్ ను బయోటెక్నాలజీ నుంచి సోషియాలజీకి మార్చుకున్నాను. నేను జూనియర్ రీసెర్చ ఫెలోషిప్ సాధించాను. సోషల్ సైన్స్ స్ స్కూల్ లో జనరల్ కేటగిరిలో సీటు తెచ్చుకున్నాను. నాతో పాటు ఐదుగురు దళిత విద్యార్థులను సస్పెండ్ చేయాలని యూనివర్సిటీ నిర్ణయించింది. మమ్మల్ని హాస్టల్ నుంచి బయటకు గెంటివేశారు. క్యాంపస్ లోని బహిరంగ ప్రదేశాలు, హాస్టల్ పరిసరాలు, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద మేము కనబడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మాకు పంపిన నోటీసుల్లో యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. నేను రోజుకూలీ చేసుకునే కార్మికుడి కొడుకును. మా అమ్మ నన్ను పెంచింది'

రోహత్ దళితుడు అనేందుకు ఈ వీడియో సాక్షమని అతడి స్నేహితుడు, అంబేద్కర్ విద్యార్థి సంఘం సభ్యుడు మున్నా సాన్నాకీ అన్నారు. గతవారం ఈ వీడియోను కనుగొన్నామని చెప్పారు. రోహిత్ కులంపై తలెత్తున్న పశ్నలకు సమాధానంగా ఈ వీడియోకు బయటకు విడుదల చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement