వీళ్లసలు మనుషులేనా? | Video of dog crying | Sakshi
Sakshi News home page

వీళ్లసలు మనుషులేనా?

Oct 12 2017 7:16 PM | Updated on Sep 29 2018 4:26 PM

Video of dog crying - Sakshi

సాక్షి, చెన్నై : తాంబరంలోని ఒక ప్రయివేట్‌ కాలేజ్‌లో చదుతున్న ఇద్దరు విద్యార్థులు ఒక వీధికుక్కను అత్యంత కౄరంగా, దారుణంగా హిం‍సించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇద్దరు విద్యార్థులు కుక్కకు ఊపిరి ఆడకుండా గొంతుకు, నడుముకు తాడు కట్టి.. అటూఇటూ ఇద్దరు రోడ్డు మీదమీద ఈడ్చుకు వెళుతుంటే ప్రాణం కోసం మూగ జంతువు గిలగిలా కొట్టుకుంటోంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఈ వీడియో చూసి స్పందించిన బ్లూక్రాస్‌ వాళ్లు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ.. చెన్నై పోలీస్‌ కమిషనర్‌ను కోరారు. దీనిపై స్పందించిన పోలీసులు.. అనుమానిత వ్యక్తులను అరెస్ట్‌ చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు.

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement