పాకిస్థాన్ పై 'ఉగ్ర పిటిషన్' కు రికార్డు మద్దతు | US-PETITION seeking to declare Pak 'terror sponsor' makes record | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ పై 'ఉగ్ర పిటిషన్' కు రికార్డు మద్దతు

Oct 5 2016 8:31 AM | Updated on Mar 23 2019 8:28 PM

పాకిస్థాన్ పై 'ఉగ్ర పిటిషన్' కు రికార్డు మద్దతు - Sakshi

పాకిస్థాన్ పై 'ఉగ్ర పిటిషన్' కు రికార్డు మద్దతు

పాకిస్థాన్ ను ఉగ్రదేశంగా ప్రకటించాలనే డిమాండు నేపథ్యంలో వైట్హౌస్ అధికారులు చేపట్టిన ఆన్లైన్ పిటిషన్ దరఖాస్తుకు రికార్డు స్థాయిలో మద్దతు లభిస్తోంది.

వాషింగ్టన్: పాకిస్థాన్ ను ఉగ్రదేశంగా ప్రకటించాలనే డిమాండు నేపథ్యంలో వైట్హౌస్ అధికారులు చేపట్టిన ఆన్లైన్ పిటిషన్ దరఖాస్తుకు రికార్డు స్థాయిలో మద్దతు లభిస్తోంది. ఇప్పటి వరకు 6,65,769 మంది ఈ పిటిషన్ పై సంతకాలు చేశారని వైట్హౌస్  ప్రకటించింది. నిన్న ఒక్క రోజే రికార్డు స్థాయిలో 50 వేల మంది సంతకాలు చేశారు. ఇప్పటి వరకు వైట్హౌస్ చేపట్టిన సంతకాల సేకరణలో 3,50,000 మంది సంతకాలు చేయడమే రికార్డుగా ఉంది. ఆ రికార్డును ఈ పిటిషన్ బద్దలు కొట్టింది. దీంతో తలలు పట్టుకున్న వైట్హౌస్ అధికారులు పిటిషన్ ను రద్దు చేశారు.

పాకిస్థాన్ ను ఉగ్రదేశంగా ప్రకటించాలనే డిమాండ్ నేపథ్యంలో సెప్టెంబర్ 21న ఈ పిటిషన్ ను వైట్హౌస్ అధికారిక వెబ్సైట్లో చేర్చారు. 30 రోజుల్లో లక్ష సంతకాలు వస్తే అమెరికా అధ్యక్షుడు 60 రోజుల్లో స్పందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు  ప్రవేశపెట్టిన ఆన్లైన్ పిటిషన్లలోని 98 శాతం పిటిషన్లపై అధ్యక్షులు స్పందించారు. దీంతో 'పాకిస్థాన్ ఉగ్రదేశం' పిటిషన్ పై ఆసక్తి నెలకొంది. అమెరికాలో ఉన్న బలూచిస్థాన్ ప్రజలు సైతం తమను పాకిస్థాన్ నుంచి వేరు చేయాలనే డిమాండ్తో ఒక పిటిషన్ ను వైట్హౌస్ వెబ్సైట్లో సంతకాల సేకరణ చేపట్టాని డిమాండ్ చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement