సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాలు విడుదల | UPSC Announced Civil Services Mains 2018 Exam Results | Sakshi
Sakshi News home page

Dec 20 2018 7:11 PM | Updated on Dec 20 2018 7:39 PM

UPSC Announced Civil Services Mains 2018 Exam Results - Sakshi

సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్ష 2018 ఫలితాలను యూపీఎస్సీ గురువారం విడుదల చేసింది.

సాక్షి, న్యూఢిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (యూపీఎస్సీ) సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్ష 2018 ఫలితాలను గురువారం విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. మెయిన్స్ పరీక్షలు 2018 సెప్టెంబరు 28 నుంచి అక్టోబర్ 7 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే.

కమిషన్‌ విడుదల చేసిన ఫలితాలలో 1994 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు జరగనున్నాయి. అభ్యర్థులు upsc.gov.in, upsconline.nic.in వెబ్‌సైట్ల ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. 

Advertisement
 
Advertisement
Advertisement