బడ్జెట్ 2016-17.. మన ఊరికి జై | Union Finance Minister Arun Jaitley latest budget | Sakshi
Sakshi News home page

బడ్జెట్ 2016-17.. మన ఊరికి జై

Mar 1 2016 2:56 AM | Updated on Apr 6 2019 9:38 PM

పేదలందరికీ లక్ష రూపాయల ఆరోగ్య బీమా గొడుగు

  •  పేదలందరికీ లక్ష రూపాయల ఆరోగ్య బీమా గొడుగు
  •  బీపీఎల్ కుటుంబాలకు     ఉచితంగా వంటగ్యాస్ కనెక్షన్
  •  ప్రైవేట్‌తో కలసి దేశవ్యాప్తంగా డయాలసిస్ సేవాకేంద్రాలు
  •  సాగు, పాడి, వ్యవసాయ అనుబంధ రంగాలకు కలిపి రూ. 44,485 కోట్లు
  •  28.5 లక్షల హెక్టార్ల భూమికి నీటి పారుదల సదుపాయం
  •  దేశవ్యాప్తంగా ఐదు లక్షల ఫామ్ పాండ్లు, ఊట బావుల     తవ్వకానికి సాయం
  •  సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం
  •  రైతు రుణాలపై వడ్డీ చెల్లింపుల కోసం రూ.15 వేల కోట్లు
  •  స్థానిక సంస్థలకు రూ.2.87 లక్షల కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్
  •  ఉపాధి హామీకి నిధుల పెంపు
  •  గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ వసతులతో కూడిన 300 రూర్బన్ సమూహాల ఏర్పాటు
  •  2018 మే 1 నాటికి గ్రామీణ విద్యుదీకరణ పూర్తి
  •  మూడేళ్లలో ఆరు కోట్ల పల్లె కుటుంబాలకు ‘డిజిటల్ పరిజ్ఞానం’
  •  కిరాణా దుకాణాలను వారమంతా తెరవొచ్చు
  •  
     వార్షిక ఆదాయం రూ. కోటి దాటితే అదనంగా 3 శాతం ‘రాబిన్‌హుడ్’ పన్ను
     వ్యక్తులు, సంస్థలకు వచ్చే డివిడెండు రూ. 10 లక్షలు దాటితే 10 శాతం పన్ను
     సాలీన ఐదు లక్షల లోపు ఆదాయం వచ్చే వారికి ఇస్తున్న రిబేట్ రూ. 2 వేల నుంచి రూ. 5 వేలకు పెంపు
     బొగ్గు, లిగ్నైట్, పీట్‌లపై టన్నుకు రూ. 200 నుంచి రూ. 400కు  క్లీన్ ఎనర్జీ సెస్ పెంపు
     
     బడ్జెట్ మొత్తం   19,78,060 కోట్లు
     ప్రణాళికా వ్యయం   5,50,010 కోట్లు
     ప్రణాళికేతర వ్యయం  14,28,050 కోట్లు

     
     రెవెన్యూ వసూళ్లు   13,77,022 కోట్లు
     మూలధన వసూళ్లు  6,01,038 కోట్లు

     
     
     పెరిగేవి..
     కార్లు ఇతర వాహనాలు, దిగుమతి చేసుకున్న గోల్ఫ్ కార్లు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, విమానయానం, కంప్యూటర్లు, బీడీలు మినహా సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు, గుట్కాలు, విద్యుత్, ఫోన్ బిల్లుల చెల్లింపులు, రెస్టారెంట్లు సహా అన్ని రకాల సేవలు, రూ. వెయ్యికి పైబడిన విలువ కలిగిన బ్రాండెడ్ వస్త్రాలు, బంగారం, వెండి, వెండితో చేసినవి మినహా మిగతా ఆభరణాలు, మినరల్ వాటర్, శీతల పానీయాలు, రూ. 2 లక్షలకు మించిన వస్తు సేవలు (నగదు రూపంలో), అల్యూమినియం ఫాయిల్, ప్లాస్టిక్ సంచులు, రోప్‌వే, కేబుల్ కార్ ప్రయాణాలు, దిగుమతి చేసుకున్న ఇమిటేషన్ ఆభరణాలు, పారిశ్రామిక సోలార్ వాటర్ హీటర్లు, న్యాయ సేవలు, లాటరీ టికెట్లు, అద్దె వాహనాలు, ప్యాకర్స్-మూవర్స్ అద్దెలు, ఈ-రీడింగ్ పరికరాలు, ఇంటర్నెట్ ద్వారా వాయిస్ కాల్స్ చేసుకునే పరికరాలు.
     
     తగ్గేవి
     పాదరక్షలు, సోలార్ దీపాలు, రూటర్లు, బ్రాడ్‌బ్యాండ్ మోడెమ్‌లు, సెట్‌టాప్ బాక్సులు, సీసీ కెమెరాలు, డిజిటల్ వీడియో రికార్డర్లు, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలు, ఒకసారి వినియోగించి పడేసే స్టెరిలైజ్డ్ డయాలసిస్ పరికరాలు, 60 చదరపు మీటర్లలోపు స్థలంలో నిర్మించిన తక్కువ ధర గృహాలు, జానపద కళాకారుల ప్రదర్శనలు, రిఫ్రిజిరేటెడ్ కంటెయినర్లు, పెన్షన్ పథకాలు, మైక్రోవేవ్ ఓవెన్‌లు, శానిటరీ ప్యాడ్స్, బ్రెయిలీ పేపర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement