మన దేశానికి భారీ మొత్తంలో అప్పులు ఉన్నాయని మనకు తెలుసు. అయితే ఐక్యరాజ్య సమితి కూడా మనకు బాకీ ఉందంటే మీరు నమ్ముతారా?
మన దేశానికి భారీ మొత్తంలో అప్పులు ఉన్నాయని మనకు తెలుసు. అయితే ఐక్యరాజ్య సమితి కూడా మనకు బాకీ ఉందంటే మీరు నమ్ముతారా? అంతా ఇంతా కూడా కాదు.. ఏకంగా 671 కోట్ల రూపాయల వరకు ఐరాస మనకు చెల్లించాల్సి ఉందట. వివిధ దేశాలకు శాంతి పరిరక్షక దళాలను పంపి, అక్కడ పనిచేసినందుకు ఐక్యరాజ్య సమితి ఈ మొత్తాన్ని మనకు ఇవ్వాల్సి ఉంది. ఐరాస నిర్వహించే శాంతి పరిరక్షక కార్యక్రమాల్లో భారతదేశం బాగా చురుగ్గా పాల్గొంటుంది.
ఈ సంవత్సరం అక్టోబర్ మూడో తేదీ వరకు ఇలాంటి కార్యక్రమాలకు సిబ్బందిని పంపినందుకు, ఇతర రకాల సాయం చేసినందుకు మొత్తం 671 కోట్ల రూపాయలు తాము భారత్కు చెల్లించాల్సి ఉందని ఐక్యరాజ్య సమితి అండర్ సెక్రటరీ జనరల్ యుకియో తకసు తెలిపారు. రెండు రోజుల్లో ఈ మొత్తాన్ని సర్దుబాటు చేసేస్తామని కూడా ఆయన అన్నారు. భారతదేశంతో పాటు ఇథియోపియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు కూడా ఐక్యరాజ్యసమితి బాకీ ఉంది.