ఎయిర్పోర్ట్ పార్కింగ్ నుంచి దూకి.. | ukrain person committed suicide in mumbai | Sakshi
Sakshi News home page

ఎయిర్పోర్ట్ పార్కింగ్ నుంచి దూకి..

Feb 15 2016 5:49 PM | Updated on Nov 6 2018 7:56 PM

ఎయిర్పోర్ట్ పార్కింగ్ నుంచి దూకి.. - Sakshi

ఎయిర్పోర్ట్ పార్కింగ్ నుంచి దూకి..

ముంబయి విమానాశ్రయంలో ఓ వ్యాపార వేత్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ముంబయి: ముంబయి విమానాశ్రయంలో ఓ వ్యాపార వేత్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం ఉక్రెయిన్కు చెందిన యువ వ్యాపారవేత్త మిఖైల్ చెక్రీన్(32) ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలోగల సెకండ్ లెవల్ పార్కింగ్ స్థలం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రక్తపు మడుగులో ఉన్న అతడిని కూపర్ ఆసుపత్రికి తరలించగా అక్కడే ప్రాణాలుకోల్పోయాడు. ఎందుకు తన ప్రాణాలు బలితీసుకున్నాడనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement