అవసరమైతే కోర్టుకెళతాం.. | Uddhav Thackeray Slams BJP Says Democracy In Our Country Is Over | Sakshi
Sakshi News home page

అవసరమైతే కోర్టుకెళతాం..

May 31 2018 6:30 PM | Updated on May 31 2018 7:12 PM

Uddhav Thackeray Slams BJP Says Democracy In Our Country Is Over - Sakshi

సాక్షి, ముంబయి : ఉప ఎన్నికల ఫలితాలపై శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాక్రే తనదైన శైలిలో స్పందిం‍చారు. పాల్ఘర్‌ ఉప ఎన్నికలపై వ్యాఖ్యానిస్తూ మన ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రక్రియకు ముప్పు వాటిల్లిందని, దీనిపై అవసరమైతే తాము న్యాయస్ధానాలను ఆశ్రయిస్తామని అన్నారు. పాల్ఘర్‌ స్ధానాన్ని బీజేపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కౌంటింగ్‌లో కొన్ని లోటుపాట్లు చోటుచేసుకున్నాయని, వీటిని పరిష్కరించేవరకూ ఫలితాలను ప్రకటించరాదని ఆయన కోరారు. అతితక్కువ మార్జిన్‌తో తాము ఇక్కడ ఓడిపోయామని అన్నారు.

చివరినిమిషంలో ఓటర్ల జాబితాలో కొత్తగా లక్ష మంది ఓటర్లు ఎలా పుట్టుకొచ్చారని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్‌లోనూ అవినీతిని చూసిన మీదట ఎన్నికల కమిషనర్లను నియమించరాదని, వారిని ఎన్నుకోవాలని సూచించారు.

ఉత్తరప్రదేశ్‌లో ఓటమి పాలయిన యోగి ఆదిత్యానాథ్‌ ఇక్కడ (మహారాష్ట్ర) ప్రచారానికి వచ్చారని ఎద్దేవా చేశారు. ఛత్రపతి శివాజీని యోగి అవమానించడాన్ని తాము మరిచిపోమని హెచ్చరించారు. బీజేపీ రెండు లోక్‌సభ స్ధానాల్లో పరాజయం పొందడంతో ఆ పార్టీ హవా కనుమరుగవుతోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement