Sakshi News home page

విజిటర్స్‌గా వెళ్లి ఆప్‌ అసెంబ్లీని వణికించారు

Published Wed, Jun 28 2017 6:57 PM

విజిటర్స్‌గా వెళ్లి ఆప్‌ అసెంబ్లీని వణికించారు - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో ఇద్దరు వ్యక్తులు నానా రచ్చ చేశారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా లేచి మంత్రి సత్యేంద్ర జైన్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేయడంతో సభలో ఉన్న వారంతా ఉలిక్కి పడ్డారు. కాసేపట్లోనే గందరగోళ వాతావరణం నెలకొంది. నినాదాలు చేసినవరు వారు తాము ఆమ్‌ఆద్మీపార్టీ కార్యకర్తలం అని చెప్పుకున్నారు. బుధవారం ఢిల్లీ అసెంబ్లీ జరుగుతుండగా విజిటర్లుగా వచ్చిన ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్తలు అనూహ్యంగా అక్కడి నుంచి లోపలికి దూసుకొచ్చారు.

ఆ తర్వాత వెంటనే ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. జైన్‌కు వ్యతిరేకంగా నినాదులు చేస్తూ ఆయన ఓ అవినీతిపరుడని గట్టిగా అరుస్తూ ఏవో కాగితపు ముక్కలను అక్కడ కూర్చున్న చట్ట సభ ప్రతినిధులపైకి విసిరారు. దీంతో అక్కడే ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ మద్దతుదారులు వారితో గొడపడ్డారు. చేయికూడా చేసుకున్నారు. దీంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.ప ఆ సమయంలోనే స్పీకర్‌ రామ్‌ నివాస్‌ గోయెల్‌ వారిని అరెస్టు చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఢిల్లీ పోలీసులు వారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.

Advertisement
Advertisement