జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం | Two terrorists neutralized in Anantnag encounter | Sakshi
Sakshi News home page

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

Apr 25 2019 10:14 AM | Updated on Apr 25 2019 10:19 AM

Two terrorists neutralized in Anantnag encounter - Sakshi

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా బిజ్‌బహరాలోని బగేంద్ర మొహల్లాలో భద్రతాబలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపట్టాయి. ఉగ్ర కదలికలున్నాయన్న సమాచారంతో  సోదాలు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఎదురు కాల్పులు జరిపిన దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. మృతిచెందిన ఉగ్రవాదులను సఫ్ద్‌ అమీన్‌ భట్‌, బుర్హాన్‌ అహ్మద్‌లుగా గుర్తించారు. ఘటనాస్థలిలో ఏకే ‌, ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిల్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement