ఎన్‌ఐఏకు కోరెగావ్‌ కేసు

Transfer of Koregaon-Bhima case to NIA - Sakshi

పుణే: 2018 కోరెగావ్‌–భీమా అల్లర్ల కేసు పుణే పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు బదిలీ అయింది. ఈ మేరకు తమకు కేంద్ర హోంశాఖ నుంచి శుక్రవారం సమాచారం వచ్చినట్లు మహారాష్ట్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజయ్‌  తెలిపారు. 2018లో చెలరేగిన కోరెగావ్‌–భీమా అల్లర్ల కేసులో వామపక్ష నేతలు వరవరరావు, సుధీర్‌ ధావలే, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, మహేశ్‌ రౌత్, షోమా సేన్, అరుణ్‌ ఫెరీరా, వెర్నాన్‌ గొన్‌సాల్వెస్, సుధా భరద్వాజ్‌లను అర్బన్‌ నక్సల్స్‌ పేరుతో అరెస్ట్‌ చేయడం తెల్సిందే. గత బీజేపీ ప్రభుత్వంలో కోరెగావ్‌–భీమాపై పెట్టిన కేసును తిరగదోడితే తమ బండారం బయటపడుతుందనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ మండిపడ్డారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top