'పార్టీలకు పన్ను మినహాయింపులు ఉండాల్సిందే' | To be a party to tax breaks: Center | Sakshi
Sakshi News home page

'పార్టీలకు పన్ను మినహాయింపులు ఉండాల్సిందే'

Aug 22 2016 2:26 AM | Updated on Sep 17 2018 5:36 PM

రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలనీ, వాటికి పన్నుమినహాయింపులు ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

న్యూఢిల్లీ : రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలనీ, వాటికి పన్నుమినహాయింపులు ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. పార్టీలకు ఇస్తున్న పన్ను వెసులుబాట్లను రద్దు చేయాలన్న సూచనను తిరస్కరించింది. పార్టీల రాజకీయ కార్యకలాపాలను ప్రోత్సహించ డం, ప్రజాస్వామ్య ప్రయోజనాల కోసం పార్టీల కార్యక్రమాలను నియంత్రించడం అనే రెండు విరుద్ధ చర్యల మధ్య సమన్వయం తీసుకురావడానికి.. పార్టీలకు ఇచ్చే పన్ను మినహాయింపులు ఉపయోగపడతాయని ప్రభుత్వం తెలిపింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కార్యకర్త సుభాష్ అగర్వాల్ ఇచ్చిన సలహా ఆచరణ యోగ్యం కాదని ఆర్థిక శాఖ చెప్పింది.

ఆదాయపు పన్ను చట్టం-1961లోని 13ఏ, 80జీజీబీ, 80జీజీసీ సెక్షన్లు..రాజకీయ పార్టీలను ప్రోత్సహించడానికి, వాటికి సాధికారత కల్పించడానికి ఉద్దేశించినవని పేర్కొంది. ఆరు జాతీయ పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ, బీఎస్‌పీ, ఎన్‌సీపీ, సీపీఐ, సీపీఎం) ప్రస్తుతం ఆర్టీఐ పరిధిలో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి రాయితీలు, పన్ను మినహాయింపుల రూపంలో పరోక్షంగా పార్టీలు నిధులు అందుకుంటాయి కాబట్టి వీటిని ఆర్టీఐ పరిధిలోకి తెచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement