దుండగులకు చుక్కలు చూపిన వృద్ధ దంపతులు! | Tirunelveli Couple Courageous Fight With Attackers | Sakshi
Sakshi News home page

దుండగులపై వృద్ధ దంపతుల ఎదురుదాడి!

Aug 12 2019 3:54 PM | Updated on Aug 12 2019 4:45 PM

Tirunelveli Couple Courageous Fight With Attackers - Sakshi

సాక్షి, చెన్నై : తమపై దాడికి దిగిన దుండగులకు వృద్ధ దంపతులు చుక్కలు చూపించారు. వారిని తీవ్రంగా ప్రతిఘటించి పారిపోయేలా చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా కడయం పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇంటి బయట కూర్చున్న వృద్ధుడిపై వెనకగా వచ్చిన ఓ దుండగుడు..అతడికి ఉరి బిగించేందుకు ప్రయత్నించాడు. అయితే వెంటనే అప్రమత్తమైన ఆ వ్యక్తి గట్టిగా కేకలు వేస్తూ భార్యను పిలిచాడు. ఇంతలో మరో ఆగంతకుడు కూడా అక్కడికి చేరుకున్నాడు.

కాగా దుండగుల చేతుల్లో కత్తులు ఉన్నప్పటికీ సదరు వ్యక్తి, అతడి భార్య ఏమాత్రం భయపడకుండా చేతికందిన వస్తువులతో వారిపై దాడి చేశారు. దీంతో కంగుతిన్న దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనకు ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ క్రమంలో ఎంతో ధైర్యంగా ఆగంతకులను ఎదుర్కొన్న వృద్ధ దంపతులను పలువురు ప్రశంసిస్తున్నారు. ఇక వృద్ధ దంపతుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తుల వివరాలు తెలిసిన వారు తమకు సమాచారం ఇవ్వాలని ప్రకటన విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement