
గూడ్స్ రైళ్లకూ టైం టేబుల్
దేశ రైల్వే వ్యవస్థలో తొలిసారిగా గూడ్స్ రైళ్లకు కూడా టైం టేబుల్ అమలు చేయనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి మనోజ్‌కుమార్ సిన్హా వెల్లడించారు.
రైల్వేశాఖ సహాయ మంత్రి మనోజ్‌కుమార్ సిన్హా వెల్లడి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: దేశ రైల్వే వ్యవస్థలో తొలిసారిగా గూడ్స్ రైళ్లకు కూడా టైం టేబుల్ అమలు చేయనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి మనోజ్‌కుమార్ సిన్హా వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం బుధవారం సాయంత్రం ఆయన తిరుపతికి విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైల్వే వ్యవస్థలో తరచూ నెలకొంటున్న ట్రాఫిక్ అంతరాయాలను నివారించే ప్రక్రియలో భాగంగానే గూడ్స్ రైళ్లకు కొత్త విధానాన్ని వచ్చేనెల నుంచి అమలులోకి తెస్తామని వెల్లడించారు. విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు అంశం కేంద్ర పరిశీలనలో ఉందని చెప్పారు.