అనంతపురం : జిల్లాలోని రాయదుర్గం పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. రన్నింగ్ గూడ్స్ ఇంజన్ నుంచి బోగీలు విడిపోయాయి. మొలకాల్మూరు నుండి కర్ణాటకలోని మంగళూరుకు వెళ్లే గూడ్స్ రైలు.. 4వ వ్యాగన్ లింక్ కట్ అవడంతో రెండుగా విడిపోయింది.
బోగీల నుంచి విడిపోయిన ఇంజిన్.. సుమారు రెండు కిలోమీటర్ల దూరం పయనించింది. ఆ తర్వాత ఇంజిన్ డ్రైవర్ తేరుకోవడంతో అసలు విషయం బయటపడింది. ఈ గూడ్స్ రైలు ఐరన్ లోడ్‌తో వెళ్తున్న సమయంలో ఇది చోటు చేసుకుంది.


