వైరల్‌: టిక్‌టాక్‌ చైర్‌ ఛాలెంజ్‌

TikTok New Chair Challenge Goes Viral In Social Media - Sakshi

టిక్‌టాక్‌లో తమ నటన, ముఖకవలికలతో చాలా మంది యూజర్లు వీడియోలు తీస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ టిక్‌టాక్‌ వీడియోల్లో తమ ప్రతిభను కనబరుస్తున్న యువత ప్రమాదకర విన్యాసాలకు పాల్పడిన సంఘటనలు చాలానే చూశాం. కొంతమంది టిక్‌టాక్‌ వీడియోలు చిత్రీకరించటంలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా టిక్‌టాక్‌ యూజర్లు సరికొత్త ఛాలెంజ్‌ను తీసుకోవచ్చి వారి టాలెంట్‌ను పరీక్షించుకుంటున్నారు. అదే కోవలో వచ్చిన వినూత్న ఛాలె‍ంజ్‌ పేరే ‘టిక్‌టాక్‌ చైర్‌ చాలెంజ్‌’. ఓ టిక్‌టాక్‌ యూజర్‌ ఈ చైర్‌ ఛాలెంజ్‌ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇప్పుడు ఈ చైర్‌ చాలెంజ్‌ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

దీన్ని ఎలా చేయాలంటే.. గోడకు మూడు అడుగుల దూరంలో నిలబడాలి. తర్వాత గోడవైపు వంగి తలను ఆ గోడకు తాకించి స్థిరంగా ఉంచాలి. గోడకు మనిషికి మధ్యలో ఒక చైర్‌ పెట్టి ఎటువంటి సాయం లేకుండా రెండు చేతులతో చైర్‌ను తమ చెస్ట్‌కు హత్తుకొని పైకి లేపాలి.  ఈ క్రమం‍లో చైర్‌ గోడకు తగలకూడదు. ఛాలెంజ్‌ చేసేవారు తమ శరీరాన్ని బ్యా‍లెన్స్‌  చేసుకుంటూ ముగించాలి. ఈ టిక్‌టాక్‌ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

నెటిజన్లు విపరీతం‍గా కామెంట్లు చేస్తున్నారు. ‘కేవలం మహిళలు మాత్రమే ఈ  చైర్‌ ఛాలెంజ్‌ను పూర్తి చేయగలరని’ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. మరొక నెటిజన్‌‘ ఇది ఒక నకిలీ ఛాలెంజ్‌ ’ అంటూ కామెంట్‌ చేశాడు. ‘నా భర్త చేయలేడు’ అని ఫన్నిగా మరో నెటిజన్‌ ట్వీట్‌ చేశారు. కేవలం సోషల్‌ మీడియాలో సంచలనం కోసమే ఇలాంటి ఛాలెంజ్‌లు క్రియేట్‌ చేస్తున్నారని మరి కొంతమంది నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. గతంలో బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌ను ప్రముఖులు విజయవంతంగా పూర్తి చేయటంతో అది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top