
అయితే, ఇటీవల ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌కు వచ్చిన కోహ్లికి అలాంటివేమీ ఎదురవలేదు. ఒక్కరు కూడా ‘సెల్ఫీ, ఆటోగ్రాఫ్ ప్లీజ్’ అంటూ పలకరించలేదు.
న్యూఢిల్లీ : విరాట్ కోహ్లి అలా సరదాగా.. సాదాసీదాగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడనుకో.. ఎలా ఉంటుంది. గోలగోలగా ఉంటుంది. సెల్ఫీ కోసం జనం ఎగబడతారు. ఆటోగ్రాఫ్ కోసం అభిమానులు క్యూ కడతారు. అయితే, ఇటీవల ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌కు వచ్చిన కోహ్లికి అలాంటివేమీ ఎదురవలేదు. ఒక్కరు కూడా ‘సెల్ఫీ, ఆటోగ్రాఫ్ ప్లీజ్’ అంటూ పలకరించలేదు. అదేంటీ.. కోహ్లికి అంతటి అవమానమా అనుకుంటున్నారా..! అలాంటిదేం లేదు.
ఎందుకంటే అతను కోహ్లిని పోలి ఉన్న మరో వ్యక్తి. అచ్చు కోహ్లిలా ఉన్న ఓ వ్యక్తికి సంబంధించిన వీడియోను @amit_yadav2296 అనే యూజర్ టిక్‌టాక్‌లో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది. కోహ్లి హవాభావాలతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అతన్ని చూసి.. చాలామంది అతను కోహ్లియేనని భ్రమపడ్డారు. అయితే, టీమిండియా స్టార్ క్రికెటర్ వస్తున్నప్పుడు అంత సాదాసీదా వాతావరణం ఉంటుందా..! సెల్ఫీల కోసం... ఆటోగ్రాఫ్‌ల కోసం జనం ఎగబడేవారు కదా అని కొందరు ప్రశ్నించారు. వీడియోను కాస్త పరిశీలించి చూసి.. అతను కోహ్లి కాదని నిర్ధారించుకున్నారు.