నువ్వు పులివైతే నేను కొండ చిలువ! | Tiger, python fighting in forest | Sakshi
Sakshi News home page

Sep 2 2018 9:32 AM | Updated on Sep 2 2018 9:41 AM

Tiger, python fighting in forest - Sakshi

సాక్షి, మైసూరు : తన పరాక్రమం, రాజసంతో అడవిని ఏలే పులిరాజును ఓ కొండచిలువ తోక ముడిచేలా చేసింది. పులులకు ఆలవాలమైన మైసూరు జిల్లాలోని నాగరహళె అటవీప్రాంతంలో శనివారం జరిగిన ఈ సంఘటన పర్యాటకుల కంటపడింది. అటవీ ప్రాంతంలో గంభీరంగా నడుచుకుంటూ వెళుతున్న పెద్దపులి తన దారికి అడ్డంగా కొండచిలువ ఉండడాన్ని గమనించింది. నిదానంగా కొండచిలువను సమీపించిన పులి తన దారి నుంచి తప్పుకోవాలన్నట్లుగా పంజాతో దానిపై మెల్లగా తట్టింది. దీంతో అప్రమత్తమైన కొండచిలువ పెద్దపులిపై తిరగబడింది. మరోసారి కొండచిలువను భయపెట్టడానికి పులి ప్రయత్నించగా ఏమాత్రం వెనక్కి తగ్గని కొండచిలువ పులి మీదకు దూకే యత్నం చేసింది. దీంతో ఎందుకొచ్చిన తంటా అని అనుకున్న పెద్దపులి పక్కనుంచి వెళ్లిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement