ఐఎస్‌ఐఎస్‌లో ముంబై యువకులు! | Three Mumbai youths 'suspected' to have joined ISIS, says police | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఐఎస్‌లో ముంబై యువకులు!

Dec 21 2015 7:09 PM | Updated on Aug 21 2018 5:52 PM

ముంబైకి చెందిన ముగ్గురు యువకులు ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద గ్రూపులో చేరినట్టు అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ముంబై: ముంబైకి చెందిన ముగ్గురు యువకులు ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద గ్రూపులో చేరినట్టు అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా కనిపించకుండాపోయిన అయాజ్‌ సుల్తాన్ (23), మోసిన్ షేక్‌ (26), వాజిద్‌ షేక్‌ (25) ఐఎస్‌లో చేరినట్టు భావిస్తున్నామని, ఈ విషయపై దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు కూడా పశ్చిమ ముంబైలోని మాల్వానీ ప్రాంతానికి చెందినవారు. కనిపించడం లేదని ఈ ముగ్గురు యువకుల తల్లిదండ్రులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ముగ్గురిని అతివాద భావజాలంతో ప్రభావితం చేసి ఐఎస్‌లో చేరాలే ప్రేరేపించారని, వీరిలో సుల్తాన్ అక్టోబర్ 30 నుంచి అదృశ్యమవ్వగా, మిగతా ఇద్దరు ఈ నెల 16 నుంచి కనిపించకుండా పోయారని పోలీసులు తెలిపారు. కువైట్‌కు చెందిన సంస్థ నుంచి ఉద్యోగం ఆఫర్‌ వచ్చిందని, ఇందుకోసం పుణె వెళ్లాలని సుల్తాన్ ఇంట్లో చెప్పగా, స్నేహితుడి పెళ్లికి వెళుతానని చెప్పి మోసిన్‌, ఆధార్ కార్డు మీద పేరు సరిచేసుకోవడానికి వెళుతున్నానని వాజిద్‌ ఇంటి నుంచి బయటకొచ్చేశారు. ప్రస్తుతం ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) వారి ఈమెయిల్ పాస్‌వర్డ్‌లు సాధించి.. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నదని పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement