ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌... మావోయిస్టులు మృతి | Three Maoists Killed in Chhattisgarh Encounter | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌... మావోయిస్టులు మృతి

Oct 26 2017 8:43 AM | Updated on Oct 26 2017 2:50 PM

Three Maoists Killed in Chhattisgarh Encounter

రాయ్‌పూర్ : చత్తీస్‌గడ్ రాష్ట్రంలోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో బుధవారం అర్థరాత్రి పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. టిబెట్ బార్డర్ ఫోర్స్, చత్తీస్‌గడ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.

కోండ్‌గావ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కోపెన్ కడ్కా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగినట్లు జిల్లా ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు. మృతులను మహేశ్(ఏరియా కమిటీ మెంబర్), రాకేశ్(లోకల్ ఆర్గనైజింగ్ స్కాడ్ ఏసీఎం), రంజిత్ పల్లెమడి డిప్యూటీ కమాండర్‌లుగా గుర్తించారు.

మృతులు ఒక్కొక్కరిపై రూ. 5 లక్షల రివార్డు ఉందని ఎస్పీ వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి మందుగుండు సామాగ్రి, ఒక ఏకే 47, ఒక ఇన్‌శ్రా రైఫిల్, ఒక ఎస్‌ఎల్‌ఆర్‌ను స్వాధీనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వారందరూ బస్తర్ ప్రాంతానికి చెందినవారని తెలిపారు. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement