జమ్మూకాశ్మీర్లో ఆదివారం ప్రమాదవశాత్తూ జరిగిన పేలుడుకు ముగ్గురు మరణించారు.
జమ్మూకాశ్మీర్లో ఆదివారం ప్రమాదవశాత్తూ జరిగిన పేలుడుకు ముగ్గురు మరణించారు. ఉదంపూర్ జిల్లాలో ఓ నిర్మాణ స్థలం నుంచి పేలుడు పదార్థాలను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.
పంచేరి బెల్ట్లోని లడ్డా వద్ద ఓ మౌలిక నిర్మాణ సంస్థ పీఎంజీఎస్వై పథకం కింద పని పూర్తి చేసింది. దీంతో సామాగ్రిని వేరే ప్రాంతానికి తరలించేందుకు సిద్ధమైంది. ఇందులో పేలుడు సామాగ్రి కూడా ఉంది. ఆదివారం ఉదయం సామాగ్రిని తరలిస్తుండగా పేలుడు సంభవించింది. ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు.