Jan 9 2016 12:48 PM | Updated on Sep 2 2018 4:03 PM
ఆడవారి షాపింగ్ శైలిపై సెటైరికల్ స్టోరీ లాంటి నాటీ వీడియో ఒకటి అనేక లైక్లను షేర్లను సొంతం చేసుకుంటోంది.
న్యూఢిల్లీ: మహిళలు, వారి షాపింగ్ సందడి గురించిన కథనాలు ఇప్పటికే చాలా విన్నాం. ఆడవాళ్లు ఆ పనిలో పడితే.. ప్రపంచాన్నే మర్చిపోతారంటారు. కాలంతో పనిలేకుండా గంటల తరబడి షాపింగ్ లో మునిగిపోతారని.. అదివారికొక వ్యసనం అని కొందరు చమత్కరిస్తుంటారు కూడా. ఆడవారి షాపింగ్ శైలిపై చాలా సినిమాల్లో సెటైరికల్ స్టోరీస్ను కూడా చాలానే చూశాం. ఇపుడు ఇలాంటి నాటీ వీడియో ఒకటి అనేక లైక్లను, షేర్లను సొంతం చేసుకుంటోంది.
చౌకైన, బ్రాండ్ షాపింగ్ కోసం సాధారణ మహిళ నుంచి మొదలుకొని కార్పొరేట్ మహిళ, నవవధువు సహా మార్కెట్ లో ప్రవర్తించే తీరుపై తీసిన ఈ వీడియో ఇపుడు నెట్లో నవ్వులు పూయిస్తోంది. మార్కెట్ అంతా కలియ తిరుగుతూ వారు చేసే హంగామాపై ఢిల్లీకి చెందిన లిటిల్ బ్లాక్ బుక్ సంస్థ వ్యంగ్యంగా చిత్రీకరించిన ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.