హిమాలయం కాదు విలయాలయం | This is not a himalaya | Sakshi
Sakshi News home page

హిమాలయం కాదు విలయాలయం

May 16 2016 1:16 AM | Updated on Sep 4 2017 12:10 AM

హిమాలయం కాదు విలయాలయం

హిమాలయం కాదు విలయాలయం

హిమాలయ పరిసర ప్రాంతాలు ప్రకృతి వైపరీత్యాలకు నెలవు అని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆదివారం ప్రకటించింది.

అరకు కూడా..
 
 కోల్‌కతా: హిమాలయ పరిసర ప్రాంతాలు  ప్రకృతి వైపరీత్యాలకు నెలవు అని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆదివారం  ప్రకటించింది. అంతేకాకుండా భారత భూభాగంలోని 12 శాతం నేలల్లో పలు ప్రకృతి విపత్తులు సంభవించే ఆస్కారం ఉందని తెలిపింది. ఈ భూభాగంలో డార్జిలింగ్, సిక్కింలాంటి ఈశాన్య హిమాలయాల్లోని 1.8 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ లాంటి వాయవ్య హిమాలయ ప్రాంతాల్లోని 1.4 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతం వైపరీత్యాలు సంభవించేదిగా ఉందని వివరించింది.

పశ్చిమ కనుమల్లోని తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవాలాంటి  పలు ప్రాంతాలల్లో 0.9 లక్షల.చ.కి, తూర్పు కనుమల్లోని అరకు లాంటి ప్రాంతాల్లో 0.1 లక్షల.చ.కి ఈ జాబితాలో ఉందని జీఎస్‌ఐ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement