హిమధీర | Himalaya Day is celebrated every year on 9 September | Sakshi
Sakshi News home page

హిమధీర

Sep 9 2026 1:27 AM | Updated on Sep 9 2026 1:26 AM

Himalaya Day is celebrated every year on 9 September

నేడు హిమాలయ దినోత్సవం

చూశాం కదా... నేపాల్‌లో ఆకస్మిక వరద బీభత్సం! ‘ఆకస్మికం’ అని అంటున్నాంగానీ ఎన్నో సంవత్సరాలుగా మానవాళి చేస్తున్న తప్పుల ఫలితమే ఈ వినాశనం. ‘హిమాచల్‌ హైతో హమ్‌ హై’ ‘హిమాలయాలు ఉంటేనే మనం ఉంటాం’ అనేది ప్రసిద్ధ నినాదం. ఈ నేపథ్యంలో హిమాలయాలను కాపాడుకోవడానికి వివిధ రూపాల్లో మహిళలు చేస్తున్న కృషి గురించి...

భారత హిమాలయ ప్రాంతం పర్యావరణం నుంచి సంస్కృతి వరకు మన జీవన విధానంలో భాగమైంది.  వాతావరణ అనిశ్చితి ఎదురయ్యే ఈ ప్రాంతంలో సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను కాపాడుకోవడంలో, విత్తన సంరక్షణలో జీవవైవిధ్య సంరక్షకులుగా మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్‌ నుండి చంబా వరకు సిక్కింలోని లెప్తా నుండి అరుణాచల్‌ప్రదేశ్‌లోని అపటాని పీఠభూమి వరకు హిమాలయాలను కాపాడుకోవడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు.

కొండల్లో చెత్తకుప్పలు! ప్రతి సంవత్సరం యాత్రికులు, పర్వతారోహకులు హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఎత్తైన పర్వతమార్గాలకు వెళుతుంటారు. పారేసిన  ప్లాస్టిక్‌ బాటిల్స్, ఆహార ΄÷ట్లాలు, బట్టలు... మొదలైన వాటితో పర్వత్రపాంతాలు చెత్తకుప్పలుగా కనిపిస్తుంటాయి. ఈ చెత్తకుప్పల భారం హిమాలయాలపై అంతకంతకూ పెరుగుతూ పోతుంది. తీర్థయాత్రలు, ట్రెక్కింగ్‌కు వెళ్లే వారి సంఖ్య పెరుగుతుండడంతో చెత్త అంతకంతకూ పేరుకుపోతోంది.

నిశ్శబ్దంగా ... 
‘తీర్థయాత్ర లు, సాహస యాత్రలకు హిమాల యాలు నిశ్శబ్దంగా మ్యూలం చెల్లిస్తున్నాయి. ఎత్తైన ప్రదేశాలలో చిన్న  ప్లాస్టిక్‌ కవర్‌ కూడా దశాబ్దాల పాటు ఉండిపోతుంది’ అంటున్నారు హిమాలయన్‌ ట్రైబ్‌ ఫౌండేషన్‌ ఫౌండర్‌ ఆర్పీ నేగి. ‘ ప్లాస్టిక్‌ ఫ్రీ హిమాలయాస్‌’ నినాదంతో హిమాలయన్‌ ట్రైబ్‌ ఫౌండేషన్‌ కార్యక్రమాల్లో  మహిళలు చురుగ్గా పాల్గొంటున్నారు.

పర్వత ప్రతిధ్వని... హిమాలయన్‌ రిస్టోరేషన్‌ ప్రాజెక్ట్‌(హెచ్‌ఆర్పీ)లో చురుగ్గా పనిచేస్తోంది త్రిషా భట్టాఛార్జీ. జీవావరణ శాస్త్రంలో పట్టభద్రురాలైన త్రిష, కోయంబత్తూర్‌లోని జౌ ఔట్రీచ్‌ ఆర్గనైజేషన్‌లో హిమాలయన్‌ రిస్టోరేషన్‌ ప్రాజెక్ట్‌ కోసం రీసెర్చర్‌గా పనిచేస్తోంది. హిమాచల్‌ ప్రదేశ్‌ లోని చంబా కేంద్రంగా పనిచేస్తున్న త్రిషా ఇలా అంటుంది...‘హిమాలయాలు అనే మాట వినబడగానే కవి, తత్వవేత్త రూమీ మాట గుర్తుకు వస్తుంది నాకు...  హిమాలయాలను చూడడం నాకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకం. వసంతకాలపు రంగులు, పక్షుల కిలకిలారావాలు, స్వచ్ఛమైన గాలిని పీల్చే వన్య్రపాణులు... ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది. హిమాలయాలను కాపాడుకోవడానికి హెచ్‌ఆర్పీ చురుగ్గా పనిచేస్తోంది’

ప్రచారంతో... హెచ్‌ఆర్పీ ప్రాజెక్ట్‌లో చంబాలోని స్థానికులను భాగస్వాములను చేయడంలో కీలక పాత్ర పోషించింది పూజ. పైలట్‌ ప్రాజెక్ట్‌ కోసం తన భూమిని హెచ్‌ఆర్పీకి ఇచ్చింది. వాతావరణ సంక్షోభాన్ని నివారించడంలో చెట్లు అత్యంత విలువైన పాత్ర పోషిస్తాయి అంటూ ప్రచారం నిర్వహించింది. మహిళలు తమ భూములలో వెయ్యికి పైగా మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.

మంచు చిరుతలకు అండగా మహిళలు... హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పితి లోయలో మంచు చిరుత లు సంచరిస్తుంటాయి. వేటగాళ్ల బారిన పడి వాటి మనుగడ కష్టమయ్యే పరిస్థితి ఏర్పడింది. సున్నితమైన పర్వత పర్యావరణ వ్యవస్థను కాపాడడంలో మంచు చిరుతల ప్రాధాన్యతను గుర్తించిన స్థానిక మహిళలు అటవీశాఖ అధికారులతో కలిసి మంచు చిరుతను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. స్థానికంగా మంచు చిరుతను ‘షెన్‌’ అని పిలుస్తారు. అందుకే తమ గ్రూపుకు ‘షెన్మో’ అని పేరు పెట్టుకున్నారు. కెమెరా ట్రాప్‌లను అమర్చడం, పర్యవేక్షించడంలో శిక్షణ పొందారు.                    

కాలాతీత పర్వతాలు
‘ది సెంట్‌ ఆఫ్‌ హిమాలయాస్‌’ పేరుతో మోనా వర్మ రాసిన పుస్తకంలో హిమాలయ పర్వతశ్రేణులకు సంబంధించిన జానపద కథలు, ఇతిహాస కథలు ఉన్నాయి. హిమాలయాలు విస్తరించి ఉన్న ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఒక కథ ఇందులో ఉంది. హిమాలయ ప్రాంతంలో నివసించే గిరిజనుల ఆచార, వ్యవహారాలను ఈ కథలు తెలియజేస్తాయి. ‘హిమాలయాలు నన్ను ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉన్నాయి. యుగాలుగా నిలిచి ఉన్న ఈ కాలాతీత పర్వతాలపై నా ఆరాధనకు ఈ పుస్తకం అద్దం పడుతుంది’ అంటున్నారు మోనా వర్మ. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement