పాత నోట్లకు దొంగలూ ‘నో’ | thief also 'No' to the old notes | Sakshi
Sakshi News home page

పాత నోట్లకు దొంగలూ ‘నో’

Nov 12 2016 4:18 AM | Updated on Aug 30 2018 5:27 PM

చోరీ చేసేందుకు ఇంట్లో చొరబడిన దొంగలు నగలను మాత్రం మూటకట్టుకుని, రద్దరుున నోట్లను ఇల్లంతా చల్లి వెళ్లిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది.

చెన్నైలోని ఓ ఇంట్లో చోరి.. పాత నోట్లు ఇల్లంతా చల్లిన వైనం
 
 సాక్షి ప్రతినిధి, చెన్నై:  చోరీ చేసేందుకు ఇంట్లో చొరబడిన దొంగలు నగలను మాత్రం మూటకట్టుకుని, రద్దరుున నోట్లను ఇల్లంతా చల్లి వెళ్లిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నై శివారు ప్రాంతం వేప్పంబట్టులో నివసించే రిటైర్డు ఎరుుర్‌ఫోర్సు అధికారి స్టాన్లీ సెల్వం బుధవారం ఉదయం ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులు సహా టీనగర్‌లోని అత్తవారింటికి వెళ్లారు.

గురువారం రాత్రి తిరిగి ఇంటికి వచ్చి చూడగా తలుపులకు వేసిన తాళం పగులగొట్టి ఉంది. అలాగే లోనికి వెళ్లి చూడగా బీరువాలోని 50 సవర్ల బంగారు నగలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు. దొంగలు అదే బీరువాలో ఉన్న రూ.95 వేల (రూ.500, రూ.1000) పాత కరెన్సీ నోట్లను ఇల్లంతా చల్లి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement