ఆ తూటాలు రెండవ ప్రపంచ యుద్ధం నాటివి..

these bullets are 1925 year

 జపాన్, ఇంగ్లాండ్‌లలో తయారీ 

జయపురం(ఒడిశా): జయపురంలోని జిల్లా పారిశ్రామిక కేంద్రం కార్యాలయం వెనుక ప్రాంతంలో ఇటీవల ఒక పాయికానా ట్యాంక్‌లో 700కు పైగా లభించిన తుపాకీ తూటాలు 1925 నాటివని అనుమానిస్తున్నారు. ట్యాంక్‌లో లభించిన తూటాలపై ఉన్న వివరాల ప్రకారం అవి జపాన్, ఇంగ్లండ్‌ దేశాలలో తయారైనవిగా  పోలీసులు భావిస్తున్నారు. ఈ తూటాలు 1935–1945 మధ్యకాలంలో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో వినియోగించేవారని అభిప్రాయ పడుతున్నారు.

దాదాపు నాలుగు అంగుళాల పొడవున ఉన్న ఆ తూటాలు ఆ కాలంలోనే వినియోగించేవారు. జయపురంలో లభించిన తూటాలు వాడనివి. ఆ తూటాలు ఇక్కడికి ఎలా వచ్చాయన్న దానిపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో వాడిన తూటాలు నేడు జయపురంలో ఒక పాయికానా ట్యాంక్‌లో బయటపడడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top