రాజమండ్రి విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం | Bullets Recovered From Passenger In Rajahmundry Airport, More Details Inside | Sakshi
Sakshi News home page

రాజమండ్రి విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం

Nov 7 2024 9:24 AM | Updated on Nov 7 2024 10:37 AM

bullets recovered from passenger in Rajahmundry Airport

సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి విమానాశ్రయంలో బుల్లెట్లు కలకలం రేపాయి. విజయవాడకు చెందిన ఎం.సుబ్బరాజు అనే ప్రయాణికుడు వద్ద బుల్లెట్లు లభ్యమయ్యాయి. ఎయిర్‌పోర్ట్‌లో నిర్వహించిన భద్రతా తనిఖీల్లో ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఎస్పీఎఫ్ సిబ్బంది ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో లైసెన్సుడ్ గన్ బుల్లెట్లు తన వద్ద ఉండిపోయాయని చెప్పారు. ఆరు బుల్లెట్లు స్వాధీనం చేసుకుని ప్రయాణికుడు సుబ్బరాజును కోరుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement