కొత్త ప్రభుత్వ ఏర్పాటు మద్దతుపై కొనసాగుతున్న సస్పెన్స్ | The suspense continues to support the formation of a new government | Sakshi
Sakshi News home page

కొత్త ప్రభుత్వ ఏర్పాటు మద్దతుపై కొనసాగుతున్న సస్పెన్స్

Oct 28 2014 10:32 PM | Updated on Mar 29 2019 9:24 PM

కొత్త ప్రభుత్వ ఏర్పాటు మద్దతుపై కొనసాగుతున్న సస్పెన్స్ - Sakshi

కొత్త ప్రభుత్వ ఏర్పాటు మద్దతుపై కొనసాగుతున్న సస్పెన్స్

రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న బీజేపీ...

సాక్షి, ముంబై: రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న బీజేపీ... ఎవరి మద్దతు తీసుకోనుందనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. వాంఖడే స్టేడియంలో శుక్రవారం సాయంత్రం బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ నాయకుడు జె.పి. నడ్డా ప్రకటించారు. అయితే తక్కువ మంది మంత్రులతోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందన్నారు.ప్రస్తుతం బీజేపీకి 122 మంది ఎమ్మెల్యేలున్నారు.

ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 23 మంది ఎమ్మెల్యేల మద్ద తు అవసరం. శివసేనతో పొత్తుపై చర్చలు ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదని, ఇంకా కొనసాగుతున్నాయని నడ్డా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వంలో శివసేన భాగస్వామ్యం ఉంటుందని అంతా భావిస్తున్నారు. అయితే అధికారికంగా మాత్రం శివసేన నుంచి ఇప్పటిదాకా ఎటువంటి ప్రకటనలు వెలువడనేలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారంనాటి కార్యక్రమంలో శివసేన మంత్రులెవరైనా ప్రమాణస్వీకారం చేస్తారా? లేదా? అనే అంశంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

మరోవైపు పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఇప్పటికే బీజేపీకి మద్దతు ప్రకటించింది. మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టయితే తా ము గైర్హాజరవుతామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు శరద్‌పవార్ పేర్కొన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో శివసేనతో పొత్తుకు బీజేపీ ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ కీలక శాఖల కేటాయింపు విషయంలో ఏకాభిప్రాయానికి రావా ల్సి ఉంటుంది. ఏదిఏమైనప్పటికీ మరి కొన్ని గంటల్లోనే శివసేనతో పొత్తు ఉంటుందా? లేక ఒంటరిగానే బీజేపీ అధికారం చేపట్టనుందా? అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం మెం డుగా ఉంది.
 
చకచకా చర్చలు
బీజేపీతో చేతులు కలిపే విషయంపై శివసేనలో చర్చలు వేగవంతమయ్యాయి. ఓవైపు బీజేపీ శాసనసభ పక్షనేతను ఎంపిక జరుగుతుండగానే మరోవైపు మాతోశ్రీకి ఆ పార్టీకి చెందిన అనేకమంది నాయకులు చేరుకున్నారు. బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామి కావాలా? అయితే ఏయే శాఖలను డిమాండ్ చేయాలనే అంశంపై చర్చలు జరిగినట్టు తెలియవచ్చి ంది. ఉపముఖ్యమంత్రి పదవిని తమకు కేటాయించాలని శివసేన కోరే అవకాశం ఉంది. ఒకవేళ ఈ పదవిని శివసేనకు కేటాయించినట్టయితే అనిల్‌దేశాయ్ పేరును ఖరారు చేసే అవకాశముందని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement