రూ.2 పెరిగిన సబ్సిడీ ఎల్పీజీ ధర | The subsidy LPG price hike of Rs 2 | Sakshi
Sakshi News home page

రూ.2 పెరిగిన సబ్సిడీ ఎల్పీజీ ధర

Aug 2 2017 1:21 AM | Updated on Sep 11 2017 11:01 PM

సబ్సిడీపై అందిస్తున్న ఎల్పీజీ సిలిండర్‌ ధర మంగళవారం రెండు రూపాయలకు పైగా పెరిగింది.

న్యూఢిల్లీ: సబ్సిడీపై అందిస్తున్న ఎల్పీజీ సిలిండర్‌ ధర మంగళవారం రెండు రూపాయలకు పైగా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేసేలా ప్రతినెలా ఎల్పీజీ ధరను పెంచాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 14.2 కిలోల సబ్సిడీ సిలిండర్‌ ధర ఢిల్లీలో రూ.477.46 నుంచి రూ.479.77కి పెరిగిందని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది.   మరోవైపు ఢిల్లీలో సబ్సిడీయేతర సిలిండర్‌ ధర రూ.564 నుంచి రూ.524కు తగ్గింది.   
 

Advertisement
 
Advertisement
Advertisement