బీజేపీ కార్యాలయంలోనే దారుణం | The BJP branch office where the child was allegedly raped | Sakshi
Sakshi News home page

బీజేపీ కార్యాలయంలోనే దారుణం

Feb 14 2015 11:08 AM | Updated on Jul 12 2019 3:02 PM

బీజేపీ కార్యాలయంలోనే దారుణం - Sakshi

బీజేపీ కార్యాలయంలోనే దారుణం

కోల్ కత్తాలోని బీజేపీ కార్యాలయంలోనే దారుణం జరిగింది

కోల్ కత్తా: కోల్ కత్తాలోని  బీజేపీ కార్యాలయంలోనే దారుణం జరిగింది.  బెహలా నగరంలోని మండల బీజేపీ ఆఫీసులో అయిదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు.  తమ పాప కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు  పార్టీ ఆఫీసు తలుపు తట్టారు. దీంతో ఆ  యువకుడు అక్కడ నుంచి పరారయ్యాడు.  లోపల రక్తస్రావంతో బాధపడుతున్న బాలికను గమనించి కోపోద్రిక్తులైన స్థానికులు  ఆఫీసుపై దాడికి ప్రయత్నించారు.  వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేశారు.  పోలీసులు  బాలికను హాస్పిటల్  తరలించి చికిత్స అందిస్తున్నారు.  అత్యాచారం జరిగినట్టుగా వైద్యులు ధ్రువీకరించినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ రషీద్  మునీర్ ఖాన్ తెలిపారు.

మరోవైపు తృణమూల్ ఎంపీ  ఈ సంఘటను  ఖండించగా,  బీజేపీ అధికార ప్రతినిధి ఈ  సంఘటన దురదృష్టకరమని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా  బీజేపీ ఆఫీసు పక్కనే ఉండే ఒక షాపులో కార్యాలయం తాళాలు ఉంటాయని, నిందితుడు షాపు యజమాని కొడుకని  పోలీసులు తెలిపారు.  నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement