బకాయిలు రాక బాధలు | The arrival of arrears to suffer | Sakshi
Sakshi News home page

బకాయిలు రాక బాధలు

Jun 8 2014 10:29 PM | Updated on Aug 21 2018 5:46 PM

అన్ని కేసులను పరిష్కరించే పోలీసులు తమకు రావాల్సిన బకాయిలను మాత్రం వసూ లు చేసుకోలేకపోతున్నారు. రక్షణ కోసం పోలీసు బందోబస్తు తీసుకున్న వివిధ సంస్థలు ఇంతవరకు రూ.79.19 కోట్లు చెల్లించనే లేదు.

సాక్షి, ముంబై: అన్ని కేసులను పరిష్కరించే పోలీసు లు తమకు రావాల్సిన బకాయిలను మాత్రం వసూలు చేసుకోలేకపోతున్నారు. రక్షణ కోసం పోలీసు బందోబస్తు తీసుకున్న వివిధ సంస్థలు ఇంతవరకు రూ.79.19 కోట్లు చెల్లించనే లేదు. దీనిపై ప్రభుత్వం  తీవ్రంగా స్పందించింది. పక్షం రోజుల్లో ప్రభుత్వానికి బకాయిలు చెల్లించని పక్షంలో ఆస్తులు జప్తు చేసేందుకు నోటీసులు జారీ చేస్తామని హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బకాయిలు పడినవాటిలో 48 సంస్థలు/కంపెనీలు, 25 బ్యాంకులు, 70 మంది ప్రముఖు లు ఉన్నారు. వీరంతా రక్షణ కోసం పోలీసు సిబ్బందిని నియమించుకున్నారు.
 
అందుకు చెల్లిం చాల్సిన రూ. 79.19 కోట్లు ఇంతవరకు ప్రభుత్వ ఖజానాలో జమచేయలేదు. పలుమార్లు లేఖలు పంపించినప్పటికీ స్పందన రాలేదు. దీంతో ఆస్తు లు జప్తుచేయాలని నిర్ణయించినట్లు పాటిల్ వెల్లడిం చారు. రాష్ట్ర పోలీసుశాఖతో పోలిస్తే  ముంబై పోలీసుశాఖకు బకాయిల బెడద ఎక్కువగా ఉంది. నగర పోలీసుశాఖ నుంచి రక్షణ తీసుకున్న ప్రైవేటు వ్యక్తులు రూ. 2.67 కోట్లు బకాయిలు పడ్డారు.
 
ఇందులో రాజకీయ పార్టీకి చెందిన బడా నాయకుడు ఏకంగా రూ. 1.68 కోట్లు బకాయిలుపడ్డాడు. బకాయిలు చెల్లించాలని ఆయనకు పలుమార్లు లేఖలు జారీ చేసినప్పటికీ స్పందన రాలేదు. దీంతో ముందుగా ఆస్తుల జప్తు నోటీసు జారీ చేయనున్నట్లు పాటిల్ తెలిపారు. బకాయిదారుల్లో మహానగర పాలక సంస్థ (బీఎంసీ) రూ. 31 కోట్లు, బ్యాంకులు రూ.8.23 కోట్లు, విదర్భ క్రికెట్ జట్టు రూ.2 కోట్లు చెల్లించాల్సి ఉందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement